Sep 12,2018 10:09AM-6
జగిత్యాల: జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద నిన్న జరిగిన బస్సు ప్రమాద ఘటన స్థలాన్ని పలువురు కాంగ్రెస్, టీడీపీ నాయకులు సందర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హన్మంతరావు , మాజీ ఎంపీ ప్రభాకర్, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు రమణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇనుగల పెద్దిరెడ్డి లు సందర్శించి ఘటన తీరును పరిశీలించారు. ప్రమాదానికి అధికారులు, ప్రభుత్వ నిర్లక్షమే కారణమని ధ్వజమెత్తారు. ఘటనపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.