Sep 12,2018 12:09PM-6
వరంగల్: తాను ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానని టిఆర్‌ఎస్ నాయకురాలు కొండా సురేఖ అన్నారు. టిఆర్‌ఎస్‌లో తనను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారని ఆమె చెప్పారు. టిఆర్‌ఎస్‌లో ఒక వర్గం తమను టార్గెట్ చేసిందని ఆమె అన్నారు. తాను రెండు మూడు టికెట్లు అడిగానన్నది అవాస్తవమని ఆమె చెప్పారు. పార్టీ ముందు తాను ఎలాంటి డిమాండ్లు పెట్టలేదని, మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వంటి పదవుల హామీతోనే తనను పార్టీలోకి తీసుకున్నారని ఆమె చెప్పారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది టిఆర్‌ఎస్ కాదని ఆమె స్పష్టం చేశారు. వారి రాజకీయ అవసరాల కోసమే తనను బరిలో నిలిపారని ఆమె అన్నారు. తనకు అన్ని పార్టీలనుంచి ఆహ్వానాలు ఉన్నాయని, ఏ పార్టీలో చేరేది వినాయక చవితి తరువాత ప్రకటిస్తానని ఆమె చెప్పారు.