Sep 12,2018 05:09PM-1
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్‌లో ముసలం మొదలైంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని టీఆర్ఎస్ నతే ఈసీ శేఖర్ గౌడ్ నిరసనకు దిగారు. తన అనుచరులతో కలిసి సాగర్ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంచిరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శేఖర్ గౌడ్.. టీఆర్ఎస్ బలోపేతం కోసం తాను ఎంతగానో కృషి చేశానని అన్నారు. తనను కాదని, టీడీపీ నుంచి వచ్చిన కిషన్ రెడ్డికి టికెట్ ఇవ్వడం దారుణం అన్నారు. ఎమ్మెల్యేగా ఆయన ఏనాడు పార్టీ శ్రేణులను కలుపుకొని పోలేదని శేఖర్ ఆరోపించారు. పార్టీ శ్రేణుల్లో విభేదాలు సృష్టించి.. తన వర్గం వారికి మాత్రమే పదువులు ఇచ్చారని దుయ్యబట్టారు. మంచిరెడ్డికి కేటాయించిన టికెట్‌ను వెనక్కి తీసుకోవాలని శేఖర్ డిమాండ్ చేశారు. మంచిరెడ్డి హటావో.. టీఆర్ఎస్ బచావో అంటూ నినదించారు.