Sep 12,2018 09:09PM-1
పాట్నా: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. సల్మాన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా బీహార్ కోర్టు పోలీసులను ఆదేశించింది. సల్మాన్ సొంత నిర్మాణ సంస్థ హిందీలో నిర్మిస్తున్న ఃలవ్‌రాత్రిః చిత్రం హిందువుల మనోభావాలను గాయపరచేలా ఉండటంతో పాటు అసభ్యతను ప్రోత్సహిస్తోందంటూ స్థానిక న్యాయవాది సుధీర్ ఓజా వేసిన పిటిషన్‌పై ముజఫరాపూర్ సబ్-డివిజనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ బుధవారంనాడు విచారణ జరిపారు. పిటిషన్‌కు విచారణ అర్హత ఉందని పేర్కొన్న మేజిస్ట్రేట్... సల్మాన్‌పైన, సినిమాలో హీరోగా నటిస్తున్న సల్మాన్ బావ ఆయుష్ శర్మపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మిథాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు ఆదేశాలు జారీ చేశారు.