న్యూఢిల్లీ: తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఏంటీ..? భారతదేశంలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని, ఢిల్లీలోనూ పోటీ చేయగలనని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. తాను అసెంబ్లీకి వెళ్లాలా..? మరో చోటకు వెళ్లాలా? అనేది అధిష్టానం చూస్తుందన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పార్టీ అధినేత రాహుల్ గాంధీని కలిశారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రేణుకా చౌదరి.. తెలంగాణలో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ అధినేత రాహుల్ గాంధీతో సమావేశం సాగిందని తెలిపారు. పొత్తుల గురించి ఎలాంటి చర్చ జరలేదని తెలిపారు. అయితే పొత్తుల అంశంపై చర్చలు జరిపేందుకు తమ అధినేత కొందరికి బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఈ అంశాన్ని వారు చూస్తారని పేర్కొన్నారు. పొత్తుల వల్ల పార్టీకి తప్పకుండా లాభమే చేకూరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Sep 14,2018 06:09PM-1