Sep 18,2018 03:09PM-7
విశాఖ : సినీ నటుడు ఫిష్ వెంకట్.. వైఎస్ జగన్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 265వ రోజు మంగళవారం ఉదయం వైఎస్ జగన్.. భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. మార్గమధ్యలో ఫిస్ వెంకట్ వైఎస్ జగన్‌ను కలిసి మద్దతు తెలిపి.. కొంత దూరం జగన్‌తో నడిచారు.