Sep 18,2018 03:09PM-1
లాస్‌ఏంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు గ్లెన్ వీస్ స్టేజ్‌పై తన ప్రేయసికి ప్రపోజ్ చేసి అందరినీ షాక్‌కు గురిచేశారు. సోమవారం అమెరికాలో 70వ ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డ్స్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా స్టేజ్‌పై మాట్లాడుతూ..మా అమ్మ తర్వాత నన్ను అంతబాగా చూసుకునేది నా ప్రేయసి జాన్. జాన్..నువ్వే నా జీవితానికి వెలుగు. ఆ వెలుగును నా నుంచి ఎప్పటికీ దూరం చేయకు. నేను నిన్ను గర్ల్‌ఫ్రెండ్ అని ఎందుకు పిలవనో తెలుసా? ఎందుకంటే నువ్వు నాకు గర్ల్‌ఫ్రెండ్‌గా కాదు. నా భార్యగా ఉండాలి్ అని వెల్లడించారు. దాంతో ఆడియన్స్ మధ్యలో కూర్చున్న జాన్‌తో పాటు ఇతర సెలబ్రిటీలు, ప్రేక్షకులు లేచి చప్పట్లు కొట్టారు. జాన్ స్టేజ్‌పైకి రాగానే ఆమె వేలికి ఉంగరం తొడిగి నన్ను పెళ్లి చేసుకుంటావా్ణ అని ప్రపోజ్ చేశారు.