Sep 19,2018 12:09PM-6
హైదరాబాద్: నగరంలో ఓటర్ల జాబితా రూపకల్పనలో బల్దియా వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. పౌరులందరూ తమ ఓటును నమోదు చేసుకోవాలంటూ బుధవారం హుస్సేన్‌సాగర్‌లో బోటుపై, బుద్దుడి విగ్రహం వద్ద ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ మాట్లాడుతూ 2018 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఈ నెల 25 వరకు తమ పేరును ఓటరు జాబితాలో చేర్చుకోవాలని తెలిపారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమాలను చేపట్టిందన్నారు. గ్రేటర్ పరిధిలో పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలతో పాటు అన్ని రకాల దరఖాస్తులను అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ దానకిషోర్ పేర్కొన్నారు.