హైదరాబాద్: మధ్యాహ్నం 12 గంటల లోపే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. గణేష్ నిమజ్జనం, మొహారం భద్రతపై సీపీ అంజనీకుమార్ సమీక్ష నిర్వహించారు. సౌత్, ఈస్ట్ జోన్లలో మొహారం సందర్భంగా ఊరేగింపునకు భద్రత ఏర్పాటు చేశామన్నారు. నిమజ్జనాకి ముందే ప్రతి మండపానికి క్యూఆర్ కోడ్ ఇస్తామన్నారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు గణేష్ శోభాయాత్ర ఉంటుందన్నారు. నిమిషాల్లో నిమజ్జనం జరిగేలా ఆటోమేటిక్ రిలీజ్ హుక్ క్రేన్లు పెట్టామని తెలిపారు. 90 మొబైల్ క్రేన్లు, ఫిక్స్ క్రేన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. హుస్సేన్ సాగర్‌లో 30 వేల విగ్రహాలు నిమజ్జనం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. 310 హైపర్ సెన్సిటివ్, 305 సెన్సిటివ్ ప్రాంతాల్లో ప్రత్యేక పికెటింగ్ ఏర్పాటు చేశామన్నారు. శోభాయాత్రలో 450 ప్రత్యేక సీసీ కెమెరాలు పనిచేయనున్నాయని సీపీ తెలిపారు.
Sep 20,2018 04:09PM-7