Sep 20,2018 04:09PM-7
నిజామాబాద్ : ఆర్మూర్ సిద్దులగుట్ట శివారులో ఇవాళ మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్న బైక్ - ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.