Sep 21,2018 04:09PM-7
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన అంశం మిర్యాలగూడలో ప్రణయ్ హత్య. టీవీ ఛానళ్లలో, వార్తా పత్రికల్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ అంశం పైనే చర్చ జరుగుతోంది. కులోన్మాదంతో ముడిపడి పరువు హత్యగా తెరపైకి వచ్చింది. సినీ, రాజకీయ ప్రముఖులెందరో ఈ హత్యను ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. ఈ పరువు హత్యపై తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. 'అమృత తండ్రి మారుతీ రావు ఒక పిరికి, క్రూరుడైన క్రిమినల్. ప్రణయ్‌ను హత్య చేసి ఆ కీర్తి ప్రతిష్టలను అతడు ఏం చేసుకోలేడు. ఒకవేళ అతను పరువుకోసమే హత్య చేసినట్టైతే.. అతను కూడా చావడానికి సిద్ధంగా ఉండాలి. నిజమైన పరవు హత్య అంటే పరువు కోసం హత్య చేసేవారిని హత్య చేయడమే' అని వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు.