Sep 22,2018 09:09AM-7
హైదరాబాద్ : తుఫాన్ ప్రభావంతో మరో మూడురోజుల పాటు హైదరాబాద్ లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరికొన్నిచోట్ల తేలికపాటి వానలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయుగుండం క్రమంగా బలహీనపడుతున్నట్లు పేర్కింది. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్, కుమ్రంభీం, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి.