Sep 23,2018 10:09AM-7
మంచిర్యాల: జిల్లా కేంద్రమైన మంచిర్యాలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. వినాయక నిమజ్జనాన్ని పురష్కరించుకుని పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా... గూడెం వంతెన దగ్గర వినాయక నిమజ్జనం కొనసాగుతోంది. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలను గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు తీసుకువస్తున్నారు. దీంతో గూడెం వంతెన వద్ద రద్దీ పెరిగింది. అలాగే నిమజ్జనం జరిగే ప్రదేశం వద్ద ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ఆయా ఏర్పాట్లు చేశారు.