Sep 23,2018 12:09PM-7
హైదరాబాద్ : బాలాపూర్ మండలం ఆర్యవైశ్య సంఘం నేత టి.శ్రీనివాస్ రూ. 16.60లక్షలకు ఈ లడ్డూను దక్కించుకున్నారు. బాలాపూర్ గణపతి లడ్డూ వేలం పాటలో పాల్గొని లడ్డూను సొంత చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంతకుముందు ఎప్పుడు పాల్గొనలేదని, ఇదే మొదటిసారని చెప్పారు. తాను వేలంలో పాడిన లడ్డూను అందరికీ పంచుతానని తెలిపారు. ముందుముందు ఏం చేయాలన్నదానిపై సంఘం సభ్యులతో చర్చలు జరిపిన అనంతరం అన్ని విషయాలు మీడియాకు వెల్లడిస్తానని శ్రీనివాస్ గుప్తా స్పష్టం చేశారు.