Sep 24,2018 07:09PM-6
హైదరాబాద్: బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎక్కడ చూసిన బయోపిక్ ల ట్రెండ్ నడుస్తొంది. తెలుగులో ఇప్పటికే సావిత్రి మహానటి బ్లాక్ బస్టర్ గా నిలవగా, రాష్ట్ర రాజకీయాలలో మహా నాయకులుగా పెరొందిన ఎన్టీఆర్ , చంద్రబాబు నాయుడు ,వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ల బయోపిక్ లు సైతం చిత్రీకరణ దశలొ ఉన్నాయి. తాజాగా చంద్రబాబు నాయుడు బయోపిక్ ను చంద్రోదయం పేరుతో పి.వెంకటరమణ దర్శకత్వం లొ జి.జె.రాజేంద్ర నిర్మిస్తున్నారు. మోహన శ్రీజ సినిమాస్, శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ఈ రోజు విడుదల చేశారు.