Sep 25,2018 02:09PM-6
శాన్ ఫ్రాన్సిస్‌కో: ఇన్‌స్టాగ్రామ్ సహ వ్యవస్థాపకులు ఆ సంస్థను వీడుతున్నట్లు ప్రకటించారు. కెవిన్ సిస్ట్రోమ్, మైక్ క్రీగర్‌లు.. ఫోటో షేరింగ్ సోషల్ మీడియా సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌ను స్థాపించారు. మరి కొన్ని వారాల్లో సంస్థకు రాజీనామా చేయనున్నట్లు సీఈవో కెవిన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో క్రీగర్.. చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా ఉన్నారు. 2010లో ఈ ఇద్దరూ ఫోటో షేరింగ్ యాప్‌ను కనుగొన్నారు. ఆ తర్వాత దాన్ని 2012లో వంద కోట్ల డాలర్లకు ఫేస్‌బుక్‌కు అమ్మేశారు. అయితే కంపెనీని ఎందుకు వీడుతున్నామన్న అంశంపై మాత్రం కెవిన్ ఎటువంటి వివరణ ఇవ్వలేదు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ప్రతినిధులు కూడా ఈ అంశాలపై స్పందించలేదు.