Sep 26,2018 12:09PM-7
మిర్యాలగూడ : కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్‌ను దారుణంగా హత్యచేయించడం ఆటవిక, పిరికిపంద చర్య అని జబర్దస్త్ షో టీం లీడర్ కిరాక్ ఆర్పీ అన్నారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తూ మిర్యాలగూడలోని ప్రణయ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రేమ పెళ్లి చేసుకున్న నూతన దంపతులను హత్యోన్మాదంతో విడదీసిన పాపం ఊరికేపోదన్నారు. మారుతీరావు పరువుకోసం గర్భవతిగా ఉన్న అమృతకు భర్త ప్రేమను దూరం చేసి, తాను కేసులపాలై ఏం సాధించాడని ప్రశ్నించాడు. ఆయనవెంట కులాంతర వివాహాల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జనగామ స్వామి, ప్రదీప్ కుమార్ ఉన్నారు.