Nov 12,2018 11:11AM-1
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో నేడు అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ జరుగుతోంది. 90స్థానాలున్న అసెంబ్లీలో 18 నియోజకవర్గాల్లో ఈరోజు పోలింగ్ కొనసాగుతోంది. వీటిలో ఎక్కువగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలే ఉన్నాయి. ఉదయం పది గంటల సమయానికి 14శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు.