హైదరాబాద్ : రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ పలు పిటిషన్లు దాఖలు కావడంతో, రాఫెల్ వివరాలను సమర్పించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది. రక్షణ పరికరాల కొనుగోలు ప్రక్రియ(డీపీపీ) -2013 ప్రకారమే ఈ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేశామని కేంద్రం స్పష్టం చేసింది. ఫ్రాన్స్ తో ఏడాది పాటు ప్రత్యేక చర్చల బృందం చర్చలు జరిపిందని, భద్రతపై ఏర్పాటు చేసిన కేబినెట్ కమిటీ, కాంపిటెంట్ ఫైనాన్షియల్ అథారిటీ ఆమోదం తర్వాతే ఈ ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేసిన విషయాన్ని అత్యున్నత న్యాయస్థానానికి కేంద్రం వివరించింది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాఫెల్ ఒప్పందానికి సంబంధించి జరిగిన నిర్ణయాల ప్రతిని పిటిషనర్లకు కేంద్రం అంజేసింది.
Nov 12,2018 06:11PM-7