Nov 13,2018 12:11PM-1
చెన్నై: సిపిఎం ప్రధానకార్యదర్శి ఏచూరి సితారాం ఈరోజు డిఎంకె అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో సమావేశం కానున్నారు. స్థానిక అన్నా అరివాలయంలో సాయంత్రం ఈ భేటీ జరుగనుంది. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న 20 నియోజకవర్గాల ఉప ఎన్నికలు, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుల గురించి, భవిష్యత్తులో చేపట్టదలచిన వ్యూహం గురించి ఈ ఇరువురు నేతలు చర్చించ నున్నట్లు డీఎంకే వర్గాలు పేర్కొన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా జాతీయ స్థాయిలో బిజెపి యేతర కూటమిని పటిష్టపరచడంపైనే ఈ యిద్దరూ మాట్లాడుకోనున్నట్టు సమాచారం.