Nov 13,2018 05:11PM-8
కొచ్చి: భారత నేవీలో త్వరలో నూతన సాంకేతికతను ఏర్పాటు చేసుకునేందుకు నావికా దళం అడుగులు వేస్తున్నట్టు నేవీ ఛీప్ అడ్మిరల్ సునీల్ లంబా తెలిపారు. సముద్ర భద్రతను మెరుగుపరిచేందుకు అంతర్గత సాంకేతిక సెంటర్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఈ సాంకేతికతను ఉపయోగించుకుని నేవీని మెరుగుపరుచుకోవచ్చని ఆయన అన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో రక్షణను పెంచుకోవచ్చని తెలిపారు. నేవీ ఛీప్ మాట్లాడుతూ 18 దేశాలతో సాంకేతికతను అందిపుచ్చుకునే విధంగా ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుందని తెలిపారు.