Nov 15,2018 02:11PM-7
హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలంలో ప్రమాదం జరిగింది. సామర్లకోట-పిఠాపురం రోడ్డులో ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి చెందాడు. పిబిసి కాలువ లాకుల సమీపంలో పొలం పనులు చేస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో కౌలు రైతు అనుసూరి జోగారావు మృతి చెందాడు.