హైదరాబాద్: మహిళలపై అత్యాచారాలకు ఏ దేశమూ మినహాయింపు కాదు. దోషులకు శిక్షపడేదాకా మహిళా సంఘాలు ఉద్యమాలు చేస్తూనే ఉండటమూ కోత్త కాదు. ఐర్లాండ్ లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు ఆ దేశ పార్లమెంటును సైతం కుదిపేస్తుంది. వివరాల్లోకి వెళ్లితే ....ఇటీవల ఓ 17 ఏళ్ల బాలికపై 27 ఏళ్ల యువకుడు జరిపిన అత్యాచారం ఐర్లండ్‌లో సంచలనం సృష్టించింది. ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతుండగా.. సదరు లాయర్ బాధితురాలు ధరించిన అండర్‌వేర్‌ను గమనిస్తే బాధితురాలు ఇష్టపూర్వకంగానే సెక్సుకు అంగీకరించిందని అర్థమవుతోందని పేర్కొనడంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు ఊపందుకున్నాయి. దీనికి నిరసనగా ఐరిష్ ఎంపీ రూత్ కాపింగర్ డైల్ పార్లమెంటులో అండర్‌వేర్‌ను చూపిస్తూ లాయర్ల తీరుపై తన నిరసనను తెలియచేశారు. దీంతో ఆందోళన చేస్తున్న మహిళా సంఘాలు ఎంపీ చొరవకు నీరాజనాలు పలుకుతున్నారు. జడ్జిలకు, జూనియర్ న్యాయవాదులకు తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎంపీ కాపింగర్ వ్యాఖ్యానించారు. ఈ ఉదంతం తర్వాత మహిళా సంఘాలు నిరసస తెలిపేందుకు అండర్‌వేర్లను ఉపయోగించడం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది.
Nov 15,2018 03:11PM-1