Nov 15,2018 05:11PM-7
హైదరాబాద్ : భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, కొత్తగా విదేశీ పెట్టుబడులు రావడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 119 పాయింట్లు పెరిగి 35,261కి ఎగబాకింది. నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 10,617కి చేరుకుంది.