హైదరాబాద్ : 'మాటల మడుగు' తొలి కవితా సంకలనంతోనే కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని అందుకొని, తెలుగు సాహిత్యంలో విశేషమైన పేరుప్రఖ్యాతులు సాధించుకున్నారు కవి, రచయిత్రి మెర్సీ మార్గరేట్. తన కవితల ద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావడానికి తపి స్తున్న ఆమె రాజకీయాల్లో అడుగుపెట్టి పేదప్రజలకు సేవా చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్న నే పథ్యంలో నగరంలోని ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ముషీరాబాద్‌లో పుట్టిపెరిగడంతో తనకు ఇక్కడి పరిస్థితులు, మురికివాడల్లో నివసిస్తున్న నిరుపేద ప్రజల జీవనస్థితిగతులు బాగా తెలుసునన్నా రు. ముషీరాబాద్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల కు చేరువయ్యేందుకు, వారి సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషిచేసేందుకు ఎన్నికల్లో పోటీచేస్తున్నానని, ప్రజలు తనను ఆశీర్వ దిస్తారన్న నమ్మకముందని మెర్సీ పేర్కొన్నారు.
Nov 15,2018 06:11PM-1