Nov 20,2018 04:11PM-6
అమరావతి: తెలంగాణలో టికెట్ ఆశించి భంగపడ్డ టీటీడీపీ నేతలు తమ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అమరావతిలో కలిశారు. అసంతృప్తితో ఉన్న ఆ నేతలను చంద్రబాబు బుజ్జగించారు. పొత్తుల కారణంగా కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వచ్చిందని వివరించారు. కూటమి అధికారంలోకి రాగానే న్యాయం చేస్తానని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. చంద్రబాబు హామీతో సంతృప్తి చెందిన టీటీడీపీ నేతలు.. కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని ప్రకటించారు.