Nov 20,2018 05:11PM-6
హైదరాబాద్: రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో.. పార్టీల అధినేతలు ఇప్పుడు రెబల్ అభ్యర్థులను బుజ్జగించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే ఖైరతాబాద్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి రోహిన్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బుజ్జగించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్లే రోహిన్ రెడ్డికి టికెట్ ఇవ్వలేకపోయామని ఉత్తమ్ వివరించారు. ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన శ్రవణ్‌కు తగిన అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ భావించిందన్నారు. మధుకర్ యాదవ్, రోహిన్ రెడ్డికి సుమచిత గౌరవం ఇస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. దాసోజు శ్రవణ్, రోహిన్ రెడ్డి, మధుకర్ కలిస్తే ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయం అని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, ఉత్తమ్ వివరణతో సంతృప్తి చెందిన రోహిన్ రెడ్డి.. తన నామినేషన్‌ను ఉపసంహరించుకునేందుకు అంగీకరించారు.