Nov 20,2018 06:11PM-1
హైదరాబాద్: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఈనెల 23 న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. 2014 లో తెరాస పార్టీ నుండి ఎంపీగా గెలిచిన కొండా తాజాగా తెరాస పార్టీకి, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. పార్టీలో తనను అవమానించారని.. పార్టీకి ప్రజలకు అగాధం ఏర్పడుతుందని.. పార్టీలో సమస్యల కోసం ఎంత ప్రయత్నించినా పరఁట్టించుకోవడం లేదంటూ ఐదు పేజీల లేఖను కెసిఆర్ కు పంపిన కొండా ఈనెల 23 న సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.