కాబూల్: అఫ్గనిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సమావేశాన్ని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. కాబూల్‌లోని విమానాశ్రయం రోడ్డులో ఉన్న ఉర్నాస్ వెడ్డింగ్ హాల్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 80 మందికి పైగా గాయపడినట్లు ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇస్లాం మత ప్రవక్త మొహ్మద్ జయంతి సందర్భంగా ఈ వెడ్డింగ్ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
అనేకమంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పేలుడు పదార్థాలతో వచ్చిన ఓ ఉగ్రవాది హాల్ లోపల తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. విషయం తెలుసుకున్న వెంటనే భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు.
Nov 20,2018 08:11PM-1