Dec 06,2018 04:12PM-1
హైదరాబాద్: థాయిలాండ్‌లోని ఓ జుయెలరీ స్టోర్‌కు ఓ దొంగ వెళ్లాడు. గోల్డ్ చైన్ కావాలని స్టోర్ ఓనర్‌ని అడిగాడు. దీంతో స్టోర్ ఓనర్ చైన్లు చూపించాడు. ఓ చైన్‌ను తీసుకొని మెడలో వేసుకున్నాడు ఆ దొంగ. ఇంతలో మనోడి వ్యవహారం చూసిన ఓనర్‌కు అనుమానం వచ్చి రిమోట్ కంట్రోల్‌తో డోర్లు లాక్ చేశాడు. ఆ విషయం ఆ దొంగకు తెలియదు కదా. ఇక కాసేపు అటూ ఇటూ తిరిగి.. తెగ బిల్డప్పులు ఇచ్చి ఒక్కసారిగా స్టోర్ నుంచి పరిగెత్తబోయాడు. డోర్‌ను ఓపెన్ చేయబోయాడు. కానీ.. ఆ డోర్లు ఎంతకూ తెరుచుకోకపోవడంతో ఏం చేయలేక ఆ ఓనర్ దగ్గరికి వచ్చి ఆ చైన్‌ను తిరిగి ఇచ్చేశాడు. ఇంతలోనే ఆ స్టోర్ ఓనర్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి ఆ దొంగను అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్టోర్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియో థాయిలాండ్ సోషల్ మీడియాలో షేర్ అవడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.