Dec 07,2018 08:12PM-1
పిఠాపురం: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు చుక్కెదురైంది. ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్న కన్నాను ఓ గ్రామీణ యువకుడు నిలదీశాడు. మోడీ ఇచ్చిన హామీలపై నిలదీసిన యువకుడి ప్రశ్నల వర్షం కురిపించారు. నల్లధనం నిర్ములన, అకౌంట్లో రూ. ఐదు లక్షలు డిపాజిట్ చేస్తామని చెప్పారని ఎక్కడ ఎవరికి వేసారో చెప్పాలని నిలదీశాడు. చివరికి మోడీ హామీ ఇవ్వలేదని చెబుతూ కన్నా తప్పించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.