Jan 16,2019 03:01PM-11
లక్నో: భర్త అంత్యక్రియలు జరిగిన చితిలో తనను తాను అర్పించుకోవడానికి సిద్ధమైన 70 ఏళ్ల వృద్ధ మహిళను పోలీసులు రక్షించారు. సతీసహగమనంగా ప్రఖ్యాతిగాంచిన హిందూ సంప్రదాయమైన ఈ పద్దతి చాలా సంవత్సరాల క్రితమే నిషేధించబడింది. ఈ ఆచారం ప్రకారం భర్త చనిపోయిన భర్తతో పాటు భార్యను చితిలో వేసి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో జరిగిన ఈ సంఘటన గురించి పోలీసులు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు చట్టానికి విరుద్ధం. సతీసహగమనం కావడమే ఆవిడ (వృద్ధురాలు) కోరిక. అయితే మేం దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వం. అంతే కాకుండా ఆవిడపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఆవిడ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది అని తెలిపారు.