Jan 16,2019 04:01PM-11
అమరావతి : పోలవరంపై టీఆర్‌ఎస్ ఎంపి కవిత సుప్రీంకోర్టులో వేసిన కేసుల వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. పోలవరం పర్యావరణ అనుమతులపై స్టే ఇవ్వాలంటూ 2017 జులైలో తెలంగాణ జాగృతినుంచి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలవరం నిర్మాణంపై స్టే ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో నడుస్తోందని ఎపి సర్కార్ తెలియజేసింది.