Jan 21,2019 10:01AM-8
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం అర్పపల్లిలో పోలింగ్ సిబ్బందిని తొలగించారు. రాత్రి బంధువుల ఇంట్లో పోలింగ్ సిబ్బంది బస చేశారని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందిని మార్చాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. అభ్యర్థుల ఆందోళనతో ఐదుగురు పోలింగ్ సిబ్బందిని అధికారులు తొలగించారు.