Jan 21,2019 11:01AM-8
హైదరాబాద్: దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నవంబర్‌లో మొదలైన మొదటి షెడ్యూల్ ఇటీవల పూర్తైంది. ఈరోజు నుంచి రెండో భారీ షెడ్యూల్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రవర్గాలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాయి. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించారు. కథానాయికల వివరాలు, ఇతర తారాగణానికి సంబంధించిన వివరాలు ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రానికి 'రామ రావణ రాజ్యం' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.