Jan 21,2019 04:01PM-11
బెంగళూర్: సిద్ధ గంగ మఠాధిపతి శివకుమార స్వామి(111) ఈరోజు కన్నుమూశారు. కాగా స్వామి మృతి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మూడ్రోజులు సంతాప దినాలుగా, రేపు సెలవు ప్రకటించింది. మరోవైపు రేపు సాయంత్రం 4 గంటలకు శివకుమార స్వామి అంత్యక్రియలు జరుగుతాయని మఠానికి చెందిన అధికారులు తెలిపారు. శివకుమార స్వామి కర్ణాటకలోని శక్తిమంతమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవారు.