Jan 22,2019 11:01AM-11
ముంబై: ముంబైకి చెందిన ప్రభాత్ డైయిరీ విభాగం తిరుమల మిల్క్ ప్రొడక్ట్స్‌లో విలీనం కానుంది. ఈ విషయాన్ని ప్రభాత్ సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజికి తెలియజేసింది. తిరుమల మిల్క్ మాతృసంస్థ లాక్టలీస్ తాజాగా ప్రభాత్ డెయిరీలో వాటాలను కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ రూ.1,700 కోట్లుగా అంచనా వేశారు. 2017-18లో ప్రభాత్ డెయిరీ విక్రయాల విలువ రూ.1,554 కోట్లుగా నమోదైంది. ఈ డీల్ పూర్తికావడానికి పట్టే సమయాన్ని మాత్రం ప్రభాత్ డెయిరీ వెల్లడించలేదు. ఈ ఒప్పందానికి సంబంధించిన అనుమతులు రావాల్సి ఉంది.