Jan 22,2019 12:01PM-8
😂😂😂 🤣🤣🤣 https://t.co/loW4J6pDv2
— Ram Gopal Varma (@RGVzoomin) January 22, 2019
హైదరాబాద్ : నేను మీ ఊర్లన్నీ వస్తాను.. మీ అందర్నీ కలుస్తాను అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పాటను అందుకున్నారు. అప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని పాల్ అన్నారు. తాను ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమలోనూ త్వరలో పర్యటిస్తానని ప్రకటించారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్ స్పందిస్తూ.. ఏపీలో జగన్, చంద్రబాబుతోపాటు బీజేపీ, వీహెచ్ పీ, ఆరెస్సెస్ వంటి శక్తులు ఓడిపోతాయని జోస్యం చెప్పారు. 'మార్చిలో మార్పు, ఏప్రిల్ లో సునామీ, మనదే గెలుపు' అని కొత్త నినాదం ఇచ్చారు. ప్రజల పని ప్రజలు చేయాలనీ, దేవుడి పని దేవుడు చేస్తాడని వ్యాఖ్యానించారు. ఇందుకోసమే 50,000 మంది కోఆర్డినేటర్లను నియమించామని అన్నారు. కాగా, ఈ వీడియోను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో స్మైలీలతో పోస్ట్ చేశారు.