Just Dhoni Things In 1st Odi
— MaनYO🇮🇳 (@manyo_rajput) January 23, 2019
Guiding To Kuldeep Yadav#NZvIND pic.twitter.com/mpr3MrOdNj
హైదరాబాద్ : జట్టుకు తానెంత విలువ తేగలడో టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ మరోసారి నిరూపించాడు. నేపియర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో తన అనుభవాన్ని మరోసారి ఉపయోగించాడు. ట్రెంట్ బౌల్ట్‌ను ఔట్ చేసేందుకు కుల్‌దీప్ యాదవ్‌కు ఓ చక్కని సలహా ఇచ్చాడు. ఇంకేముందు చెప్పిన తర్వాత వేసిన బంతికే అతడు ఔటవ్వడం గమనార్హం. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 38వ ఓవర్‌ను కుల్‌దీప్ విసిరాడు. ఐదో బంతిని ఆడిన సౌథీ ఒక పరుగు తీశాడు. అప్పుడు కుల్‌దీప్‌కు ఎంఎస్ ధోనీ ఓ సలహా ఇచ్చాడు. ఓవర్ ది వికెట్ తీసుకొని గూగ్లీ విసరాలని హిందీలో చెప్పాడు. చైనామన్ బౌలర్ ఆ సలహాను తూచ తప్పకుండా పాటించాడు. ఇంకేముందు బౌల్ట్ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. రోహిత్ శర్మ దానిని అందుకున్నాడు. కివీస్ ఇన్నింగ్స్ 157 పరుగుల వద్ద ముగిసింది. గతంలో ఎన్నోసార్లు ధోనీ బౌలర్లకు, ఫీల్డర్లకు ఎలా సలహాలిచ్చాడో మనందరికీ తెలిసిందే.