హైదరాబాద్ : కండ్లు చాలా నిర్జీవంగా, ఉబ్బినట్టు కనిపిస్తున్నాయా! అలా కావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, చర్మ సమస్యలు వంటివి. ఏదేమైనా కండ్లు అందంగా కనిపించాలంటే కింది చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
నుదురు భాగం, కంటి కింది భాగం బాగా ఉబ్బితే కాటన్ క్లాత్‌లో ఒక ఐస్ ముక్కను వేసుకొని నెమ్మదిగా కంటి కింది భాగంలో మర్దన చేసుకుంటే కండ్లు తాజాగా, అందంగా కనిపిస్తాయి.
సోడియం (ఉప్పు) ఎక్కువగా తీసుకుంటే కూడా కండ్లు ఉబ్బుతాయి. శరీరంలో సోడియం శాతం అధికమైతే నీరు ఎక్కువగా తీసుకోవాలి. కాబట్టి వీలైనంత వరకు ఉప్పును తగ్గించడం మంచిది. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా వచ్చే వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు.
రాత్రి పడుకునే ముందు కచ్చితంగా మేకప్ తొలగించుకొని పడుకోవాలి. మస్కారా, షాడో, ఐ లైనర్‌ను మేకప్ రిమూవర్‌తో శుభ్రం చేసుకోవడం కీలకం.
పనుల ఒత్తిడి, నిద్ర సరిగ్గా లేకపోయినా కూడా కండ్లు అలసటకు గురవుతాయి. కాబట్టి ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడిని అదుపులో ఉంచుకోవచ్చు. దాంతో పాటు రోజులో కనీసం ఆరు లేదా ఏడు గంటల నిద్ర తప్పని సరి. నిద్ర సరిగ్గా పోవడం వల్ల మానసిక, శారీరక సమస్యలు చాలా వరకు దూరం అవుతాయి.
Feb 11,2019 08:02PM-8