Feb 12,2019 11:02AM-9
ఢిల్లీ: మాజీ ఫాస్ట్ బౌలర్ అమిత్ భండారీపై వర్ధమాన క్రికెటర్లు దాడికి దిగి, రక్తం వచ్చేలా కొట్టడంపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తీవ్ర ఆగ్రహంతో స్పందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెడుతూ, దేశ రాజధాని నడిబొడ్డున ఈ ఘటన జరగడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించాడు. నిందితులు ఎవరూ తప్పించుకోవడానికి వీల్లేదని, అమిత్ భండారీపై దాడికి దిగిన ప్రతి ఒక్కరిపైనా జీవితకాల నిషేధాన్ని విధించాలని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాగా, అండర్ 23 టీమ్ ట్రయల్స్ న్యూఢిల్లీలోని కశ్మీర్ గేట్ లోని స్టీఫెన్స్ గ్రౌండ్స్ లో జరుగుతుండగా, తమను ఎంపిక చేయలేదన్న ఆగ్రహంతో భండారిపై దాడి చేసిన జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో అమిత్ తలకు, చెవులపైనా తీవ్ర గాయాలు కాగా, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.