Feb 12,2019 12:02PM-9
అమరావతి: హమాలీ (ముఠా), ఆటో, వీధి విక్రయదారులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది హమాలీ కార్మికులు, 15 లక్షల మంది ఆటో కార్మికులు, 10 లక్షల మంది వీధి విక్రయదారులు ఉన్నారన్నారు. వీరికి ఎలాంటి చట్టాలుగానీ, హక్కులుగానీ లేవనీ, వీరు నిత్యం తమ కష్టాన్ని నమ్ముకొని అతి కష్టంగా కుటుంబ పోషణ గావిస్తున్నారన్నారు. గత ఎన్నికల సందర్భంగా వీరికీ చేయూతనిస్తామని, మొదటి కూలీ నేనేనని చెప్పిన మీరు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు అని రామకృష్ణ అన్నారు. భవన నిర్మాణ కార్మికుల తరహాలోనే హమాలీ, ఆటో, వీధి విక్రయదారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు.