Feb 12,2019 03:02PM-8
ఖమ్మం : సచివాలయంలో పని చేస్తున్న పంచాయతీరాజ్ సెక్షన్ ఆఫీసర్ నాగరాజు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఎంజీబీఎస్ వద్ద ఖమ్మం జిల్లా వాసి నాగలక్ష్మి నుంచి రూ. 60 వేలు లంచం తీసుకుంటుండగా నాగరాజును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భర్త చనిపోవడంతో కారుణ్య నియామకం కోసం నాగలక్ష్మి దరఖాస్తు చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తానని.. అందుకు రూ. 1.20 లక్షలు ఇవ్వాలని నాగరాజు డిమాండ్ చేశాడు.