Feb 12,2019 04:02PM-11
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్ హత్య జరిగిన రెండు రోజులకు మరో దారుణం వెలుగు చూసింది. పార్టీకి చెందిన మరో నేత అనుమానస్పద స్థితిలో మరణించారు. గత నెల కంతిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నిర్వహించిన ర్యాలీకి వ్యతిరేకంగా నిరసనలు చేసిన వారిలో ఒకరైనా ఆయన హూగ్లీ జిల్లాలోని దడ్‌పూర్‌లో శవమై కనిపించారు. రితేష్ రాయ్ అనే వ్యక్తి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త. పుర్బా మెదినీపూర్ జిల్లాలోని కంతి నియోజకవర్గం పరిధిలోని మూడు గ్రామ పంచాయతీలకు అధ్యక్షుడిగా ఉన్నారు. రితేష్‌కు పార్టీలో కీలక నేత, రవాణా మంత్రి సువెంధు అధికారితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి.