జైపూర్: బికనీర్ భూకుంభకోణంలో ఆరోపణలపై ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఈరోజు వాద్రా తల్లి మౌరీనా వాద్రాతో పాటు ఆయన జైపూర్ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అనంతరం తన పేస్ బుక్ ఖాతా ద్వారా స్పందిస్తూ ఎన్నికల సమయంలో కావాలని కక్ష సాధింపుగా ఇప్పుడు విచారణ అని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారన్నారు. 74 ఏళ్ల వృద్ధురాలు అని కూడా చూడకుండా కేంద్రప్రభుత్వం తన తల్లిని ఇబ్బందులకు గురిచేస్తోందని రాబర్ట్ వాద్రా ఆవేదన వ్యక్తం చేశారు. వెంట వెంటనే మూడు మరణాలతో క్రుంగిపోయిన తన తల్లికి స్వాంతన ఉంటుందని నా ఆఫీసులో గడిపిన పాపానికి ఇప్పుడు విచారణ పేరుతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టవ్యతిరేకంగా ఏదైనా జరిగినట్టు ప్రభుత్వం గుర్తించి ఉంటే నాలుగేళ్ల ఎనిమిది నెలల పాటు నన్ను విచారణకు ఎందుకు పిలవలేదు? సరిగ్గా లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి నెల రోజుల ముందు ఎందుకీ రాద్ధాంతం చేస్తున్నట్టు? అని ప్రశ్నించిన ఆయన ఇది ఎన్నికల గిమ్మిక్కు అన్న సంగతి భారత ప్రజలకు తెలిదనుకుంటున్నారా? అని నిలదీశారు.
Feb 12,2019 06:02PM-13