Feb 12,2019 08:02PM-8
హైదరాబాద్ : ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి రాజీనామాను నేడు ఏపీ శాసనమండలి ఛైర్మన్ ఆమోదించారు. కడప జిల్లాలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సూచన మేరకు ఆయన రాజీనామా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రామ సుబ్బారెడ్డి జమ్మలమడుగు నుంచి టీడీపీ తరుపున పోటీ చేయనున్నారు. కడప జిల్లాలో వైరి వర్గంగా కొనసాగుతున్న ఆది నారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్య ఇటీవల చంద్రబాబు రాజీ కుదిర్చారు. ఈ నేపథ్యంలో కడప ఎంపీ స్థానానికి టీడీపీ తరుపున ఆదినారాయణరెడ్డి. జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి రామ సుబ్బారెడ్డి పోటీ చేయనున్నారు.