హైదరాబాద్ : ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ సమావేశంలో పాకిస్థాన్ కు భారత వర్గాలు దీటుగా బదులిచ్చాయి. జమ్మూకశ్మీర్ పై పాక్ విష ప్రచారాన్ని ఖండించిన భారత్, తన అంతర్గత విషయాల్లో మరో దేశం జోక్యాన్ని సహించబోమని తేల్చి చెప్పింది. ఈ సమావేశంలో భారత్ తరఫున విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విజయ్ సింగ్ ఠాకూర్ ప్రసంగించారు. ఠాకూర్ చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యాంశాలు...
పార్లమెంటులో పూర్తిస్థాయి చర్చ అనంతరమే కశ్మీర్ విషయంలో మేం నిర్ణయాలు తీసుకున్నాం. దీనికి విస్తృత స్థాయిలో మద్దతు కూడా లభించింది. ఈ సర్వసత్తాక నిర్ణయం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారం.
మానవ హక్కుల పేరుతో ఇలాంటి వేదికలపై రాజకీయ విషప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నాం. ఇతర దేశాల్లో మైనారిటీలకు అన్యాయం జరిగిపోతోందంటూ ఇటువంటి వేదికలపై ప్రసంగించేవాళ్లు తమ దేశంలో మైనారిటీల పట్ల ఎంత అణచివేతకు పాల్పడుతున్నారో గుర్తెరగాలి.
తమ భూభాగం మీద ఉగ్రవాదానికి ఆర్థిక, సైద్ధాంతిక మద్దతు ఇస్తున్న వాళ్లే అత్యంత దారుణంగా మానవహక్కులు ఉల్లంఘిస్తున్నారన్నది నిష్టుర సత్యం.
అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్ర స్థానంగా ఉన్న చోటు నుంచే ఇలాంటి కట్టుకథలు పుట్టుకొస్తున్నాయని ప్రపంచానికి తెలుసు. ఉగ్రనేతలకు ఏళ్ల తరబడి ఆశ్రయం కల్పిస్తూ, ప్రత్యామ్నాయ దౌత్యం పేరిట సరిహద్దు తీవ్రవాదాన్ని ఓ దేశం పెంచిపోషిస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 10,2019 09:28PM