హైదరాబాద్ : తాను నిర్వహించనున్న సహస్ర చండీ యాగానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానించారు. గురువారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రిని కలిసిన శ్రీనివాస్ రెడ్డి ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి కె. తారక రామారావును కూడా శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానించారు. ఖమ్మం జిల్లా నారాయణపురంలోని తన స్వగృహంలోఈ యాగాన్ని శ్రీనివాస్ రెడ్డి నిర్వహించనున్నారు. ఈ నెల 13 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు ఈ యాగం జరగనుంది. రాష్ట్ర శ్రేయస్సును, రైతులు సహా అన్ని వర్గాల సంక్షేమాన్ని, ప్రకృతి కరుణను కాంక్షిస్తూ ఈ యాగాన్ని శ్రీనివాస్ రెడ్డి నిర్వహించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm