Oct 14,2019 07:06AM
హైదరాబాద్: తుఫాన్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జపాన్‌కు సాయం అందించేందుకు భారత నౌకాదళం ఐఎన్‌ఎస్ సహ్యాద్రి, ఐఎన్‌ఎస్ కిల్టన్‌ను ఆ దేశానికి తరలించింది. జపాన్‌లో హగిబిస్ తుఫాన్ బీభత్సాన్ని సృష్టిస్తున్నది. భారీ వర్షాలతో దేశంలోని పలు నగరాలు, పట్టణాలు జలమయమయ్యాయి.14 నదులు పొంగిపొర్లుతున్నాయి. రాజధాని నగరం టోక్యోపై తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. గంటకు 216 కి.మీ. వేగంతో బలమైన గాలు లు వీచాయి. వివిధ ఘటనల్లో 33 మంది మరణించగా.. వందలాది మంది గాయపడ్డారు. కొండచరియలు విరిగిపడటం, వరదలు పోటెత్తడంతో పలువురు గల్లంతయ్యా రు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులను హెలికాఫ్టర్లు, పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాన్ నేపథ్యంలో రగ్బీ ప్రపంచ కప్ టోర్నమెంటును అధికారులు రద్దు చేశారు.