Oct 14,2019 07:37AM
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న కఠిన శైలీకి వ్యతిరేకంగా ఈ నెల 19వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు నిరసనకారులు పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్‌కి విపక్షాలు మద్దతు తెలిపాయి. ప్రభుత్వం కార్మికుల జీవితాలతో ఆడుకుంటోంది అని భట్టి విక్రమార్క అనగా, సకల జనుల సమ్మెుగా ఈ సమ్మె రూపుదిద్దుకోంటోందని కోదండరామ్ హెచ్చరించారు. కానీ, తాము మాత్రం పార్టీలతో కలిసి పని చేసేది లేదని ఉద్యోగుల సంఘం నేత మమత తెలిపారు.